కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన కాగ్

జీఎస్టీ పరిహారం చెల్లింపుల విషయంలో కాగ్ కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్రం.. రాష్ట్రాలకు అన్యాయం చేసిందని ఆక్షేపించిది. రాష్ట్రాలకు చెల్లించాల్సిన 47వేల కోట్లకు పైగా పరిహారాన్ని కేంద్రం దారి మళ్లించిందని కాగ్ నివేదికలో తెలిపింది. ఇలా ఇతర అవసరాలకు దారి మళ్లించడం జీఎస్టీ చట్టానికి విరుద్దమని కాగ్ ఎండగట్టింది. జీఎస్టీ సెస్ కింద వసూలు చేసిన మొత్తాన్ని చట్టం ప్రకారం రాష్ట్రాలకు చెల్లించాలని.. కానీ, కేంద్రం వేరే పథకాలకు ఈ మొత్తాన్ని వాడుకుందన్ని వివరించింది. అయితే, కేంద్రం జీఎస్టీ పరిహారం చెల్లించాలని పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసనలు తెలియజేసిన విషయం తెలిసిందే. జీఎస్టీ వలన రాష్ట్రానికి ఆదాయంలో వచ్చిన నష్ట్రాన్ని ఐదేళ్ల పాటు కేంద్రమే భరిస్తుందని 2017లో ఒప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఆ పరిహారాన్ని పూర్తిగా రాష్ట్రాలకు చెల్లించడంలేదు. అయితే, ఈ ఏడాది కరోనాను కారణంగా చూపిస్తూ అసలు ఇవ్వలేమని కేంద్రం చెప్పింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com