జాతీయం

Lalu Prasad Yadav : లాలూ ప్రసాద్ యాదవ్‌పై మరో కొత్త కేసు

Lalu Prasad Yadav : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై మరో కొత్త కేసు నమోదైంది..

Lalu Prasad Yadav :  లాలూ ప్రసాద్ యాదవ్‌పై మరో కొత్త కేసు
X

CBI : బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై మరో కొత్త కేసు నమోదైంది.. ఆయ‌న బీహార్ సీఎంగా ఉన్న సమయంలో రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సీబీఐ ఆయ‌న‌పై తాజాగా అభియోగాలు మోపింది.

లాలూతో పాటు, ఆయ‌న కుటుంబ స‌భ్యులను కూడా ఈ కొత్త కేసులో నిందితులుగా పేర్కొంది. లాలూ,ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ అధికారులు సోదాలు జరుపుతున్నారు. 73 ఏళ్ల లాలూ ప్రసాద్ యాదవ్‌ ఇటీవల దాణా కుంభకోణం కేసులో వారం రోజుల క్రితమే బెయిల్ పై విడుదలయ్యారు.

లాలూ సీఎంగా ఉన్న సమయంలో బీహార్ లో దాణా కుంభకోణం కేసు చోటుచేసుకుంది. ఈ కేసులో లాలూకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటుగా రూ. 60 లక్షల జరిమానా విధించింది. లాలూ యాదవ్ 1990 నుండి 1997 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.

Next Story

RELATED STORIES