జాతీయం

సీఎం సెక్స్‌ సీడీ ఉందంటూ బాంబు పేల్చిన ఎమ్మెల్యే

‌. కొందరు బీజేపీ ఎమ్మెల్యేల దగ్గర ముఖ్యమంత్రికి చెందిన సీడీ ఉందంటూ విధానసభలో చేసిన కామెంట్ దుమారం రేపుతోంది.

సీఎం సెక్స్‌ సీడీ ఉందంటూ బాంబు పేల్చిన ఎమ్మెల్యే
X

కర్నాటకలో బయటికొచ్చిన సెక్స్‌ సీడీ ఒక్కటే. కాని, సాక్షాత్తు ముఖ్యమంత్రి యడియూరప్ప సీడీ కూడా ఉందంటూ బాంబు పేల్చారు బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడపాటిల్‌. కొందరు బీజేపీ ఎమ్మెల్యేల దగ్గర ముఖ్యమంత్రికి చెందిన సీడీ ఉందంటూ విధానసభలో చేసిన కామెంట్ దుమారం రేపుతోంది. ఒక బీజేపీ ఎమ్మెల్యే అయి ఉండి, కొందరు బీజేపీ ఎమ్మెల్యేలపైనా అందులోనూ సీఎం యడియూరప్పపైనా ఇలాంటి కామెంట్స్‌ చేయడంతో కర్నాటక మొత్తం సీడీల వ్యవహారంపై చర్చ జరుగుతోంది. సీఎంను టార్గెట్‌ చేస్తూ మాట్లాడుతున్న ఎమ్మెల్యే బసవనగౌడపై బీజేపీ జాతీయ క్రమశిక్షణ సమితి నోటీసులు కూడా ఇచ్చింది. అయినాసరే సదరు ఎమ్మెల్యే ఎక్కడా తగ్గడం లేదు. సాక్షాత్తు విధానసభలో ఈ కామెంట్స్‌ చేయడంతో కర్నాటక రాజకీయాలను సీడీ పాలిటిక్స్‌ ఓ మలుపు తిప్పుతాయనే చర్చ జరుగుతోంది. రమేశ్ జార్కిహోళి ఒక్కడిదే కాదని.. మరో 23 సీడీలు మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద ఉన్నాయని, అందులో తండ్రీ కొడుకుల సీడీ కూడా ఉందన్నారు. ఆ సీడీలను అవసరాన్ని బట్టి వాడుకునే అవకాశం కూడా ఉందంటూ సంచలన కామెంట్స్ చేశారు.

బసవరగౌడ కామెంట్లను తేలిగ్గా తీసుకోడానికి వీల్లేదు. ఎందుకంటే 2018లో 15 మంది అప్పటి కుమారస్వామి ప్రభుత్వంపై తిరగబడ్డారు. బీజేపీలోకి వెళ్లే ముందు ముంబైలోని ఓ హోటల్‌లో క్యాంప్‌ రాజకీయాలు నడిపారు. ఆ 15 మందిలో ఆరుగురు మంత్రులు కోర్టుకు వెళ్లి ఇంజక్షన్‌ ఆర్డర్‌కు దరఖాస్తు చేశారు. ఒకవేళ తమ సీడీలు బయటికి వస్తే ఎవరూ ప్రచారం గాని, ప్రసారం గాని చేయకుండా చూడాలంటూ కోర్టుకు విన్నవించుకున్నారు. దీనిపై కాంగ్రెస్‌ విరుచుకుపడుతోంది. ఏ తప్పూ చేయకపోతే ఆ ఆరుగురు కోర్టుకు వెళ్లడం ఎందుకని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోంది. పైగా అలా కోర్టుకు వెళ్లిన ఆరుగురు కూడా రమేశ్‌ జార్కిహోళి సూచనల మేరకు నడుచుకున్న వారేనని చెప్పుకుంటున్నారు. మరోవైపు సెక్స్‌ స్కాండల్‌లో దొరికిపోయిన రమేశ్‌ జార్కిహోళి కూడా రగిలిపోతున్నారు. తాను సైలెంట్‌గా ఉండేదే లేదని.. మిగతా మంత్రుల భాగోతం బయటపెడతానని సన్నిహితులకు చెబుతున్నారట. దీంతో ఆ ఆరుగురు మంత్రుల సీడీలు బయటకు రాబోతున్నాయన్న ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకుంది.

రమేశ్‌ జార్కిహోళి ఇప్పటికీ అదంతా ఫేక్‌ వీడియోలనే వాదిస్తున్నారు. బెంగళూరులోని ఓ హోటల్‌లో సీడీలను సృష్టించారని చెబుతున్నారు. అంతేకాదు, ఆ సీడీలు ఎవరు తయారుచేశారు, ఎవరు తయారుచేయించారో కూడా ముందే తెలుసంటూ రమేశ్‌ జార్కిహోళి స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. వారి గుట్టురట్టు చేసి నలుగురి మధ్య లాగుతానంటూ శపథం చేశారు. దీనిపై కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సెటైర్ వేశారు. తమపై కుట్ర పన్నుతున్నట్లు గుర్తించిన వెంటనే అప్రమత్తం కాకపోవటం అవతలి వారి బలహీనత అంటూ కౌంటర్‌ చేశారు. సీడీ స్కాం వెనుక 5 కోట్ల రూపాయల డీల్‌ ఉందని చెప్పుకొచ్చారు మాజీ సీఎం కుమారస్వామి. ఫిర్యాదు చేసిన వ్యక్తిని సెల్‌లో పడేసి నాలుగు తగిలిస్తే అసలు నిజం బయటకు వస్తుందంటూ మాట్లాడారు.

కన్నడనాట సీడీ పాలిటిక్స్‌ హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. ఏ ఎమ్మెల్యేను టచ్ చేసినా, జనాలను కదిపినా.. సీడీల గురించే మాట్లాడుకుంటున్నారు. ఫలానా ఎమ్మెల్యే, ఫలానా మంత్రి సీడీ కూడా ఉందంటూ మాట్లాడుకుంటున్నారు.


Next Story

RELATED STORIES