సెలబ్రెటీల ఫిట్‌నెస్ ట్రెయినర్ హఠాన్మరణం

మంచి ఆహరం.. కండలు కరిగేలా వ్యాయామం.. అయినా అతి చిన్న వయసులోనే గుండెపోటుకు గురై మరణించారు సత్నాం ఖత్రా.. సెలబ్రెటీలకు ట్రెయినర్ అయిన ఖత్రా 1989లో పంజాబ్ లోని భాడ్సన్ లోని ఓ గ్రామంలో జన్మించారు. మెలితిరిగిన కండలతో కనిపించే ఖత్రా మోడల్ గా రాణించారు. ఖత్రా ఫిట్ నెస్ క్లబ్ కు కోచ్ గా వ్యవహరించేవారు. సెలబ్రెటీలకు ఫిట్‌నెస్ ట్రైనర్ గా పని చేస్తున్న ఖత్రా డ్రగ్స్ బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు అతడిని డీ అడిక్షన్ సెంటర్ లో చేర్పించారు. చికిత్స అనంతరం రికవరీ అయి మాదక ద్రవ్యాలకు పూర్తిగా స్వస్తిపలికారు. వృత్తిపై మరింత ఫోకస్ పెట్టి పని చేశారు. ఆరోగ్యం కోసం శారీరక వ్యాయామాలతో పాటు డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని యువతకు సందేశమిచ్చేవారు. ఫిట్‌నెస్ ఉత్పత్తులను సొంత బ్రాండుతో మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంతలోని హఠాత్తుగా మరణించడం అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. ఫిట్‌నెస్ ఉన్న వ్యక్తికి గుండెపోటు రావడమేంటని సందేహం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ మాఫియానే అతడి మారణానికి కారణమై ఉంటుందని భావిస్తున్నారు. నాలుగు లక్షలకు పైగా ఫాలోయర్లను సంపాదించుకున్న ఖత్రా మరణం బాలీవుడ్ కు తీరని లోటు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com