రైతు సంఘాలతో ముగిసిన కేంద్రం చర్చలు!

రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం ఆరో దఫా చర్చలు ముగిసాయి. గత చర్చలతో పోలిస్తే కొంత మెరుగైన ఫలితాలే వచ్చినట్లుగా కనిపిస్తోంది. అయితే, కీలక అంశాలపై ఇంకా అంగీకారం కుదరనట్లుగా తెలుస్తోంది. మద్దతు ధరపై రాతపూర్వక హామీకి కేంద్రం అంగీకరించగా. మొత్తం రెండు అంశాలపై దాదాపుగా ఏకాభిప్రాయం కుదిరినట్లుగా తెలుస్తోంది. ఐదు గంటలపాటు సాగిన చర్చల్లో సాగు చట్టాల రద్దు అంశంలో మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతోంది.. జనవరి నాలుగున మరోసారి రైతులతో కేంద్రం చర్చలు జరపనుంది.
రాజధాని పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్య ఆర్డినెన్స్‌లో శిక్ష, జరిమానాల నుంచి రైతులను మినహాయింపునిస్తూ సవరణలు చేసేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించగా.. విద్యుత్ చట్ట సవరణ ముసాయిదా బిల్లులో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. మూడు చట్టాలను రద్దు చేయడానికి ససేమిరా అంటుండగా, కనీస మద్దతు ధరపై చట్టం తెచ్చే విషయంలోనూ కేంద్రం సానుకూలంగా స్పందించలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com