బాంకు ఉద్యోగులకు శుభవార్త.. పెరగనున్న పెన్షన్

బాంకు ఉద్యోగులకు శుభవార్త.. పెరగనున్న పెన్షన్
X
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.

దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల పెన్షన్ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి దేబశీష్ పాండా తెలియజేశారు. ఉద్యోగి చివరగా తీసుకున్న జీతంలో 30 శాతం పెన్షన్ రూపంలో పొందుతారు. దాంతో ఇప్పటి వరకు రూ.9,284 గా ఉన్న పెన్షన్ కాస్తా రూ.30,000-35,000కు పెరగనుంది.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ప్రభుత్వ రంగ బ్యాంకు పనితీరును సమీక్షించారు. కరోనా కష్టసమయంలో బ్యాంకులు సమిష్టిగా పని చేశాయని ఆమె అన్నారు. కాగా, గత నెల నుంచే బ్యాంకు ఉద్యోగులు పెన్షనర్లకు డీఏను 27.79 శాతానికి కేంద్రం పెంచింది.

Tags

Next Story