హైదరాబాద్, బెంగుళూరు విమానాశ్రయాలకు కేంద్రం గుడ్ బై!.

హైదరాబాద్, బెంగుళూరు విమానాశ్రయాలకు కేంద్రం గుడ్ బై!.
విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది.

విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. జాతీయ ఆస్తుల నగదీకరణ పైప్‌లైన్‌ (NAMP) కింద విమానాశ్రయాల ప్రైవేటీకరణ చేపట్టి తద్వారా 2025 నాటికి రూ.20,782 కోట్లు సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే ప్రధాన విమానాశ్రయాల్లో ఏఏఐ వాటా అమ్మకం ద్వారా రూ.10,000 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ముందుగా ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) నిర్వహణలోని హైదరాబాద్‌, బెంగళూరు విమానాశ్రయాల ప్రైవేటీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ రెండు విమానాశ్రయాల్లో భారతీయ విమానాశ్రయ ప్రాధికారిక సంస్థ (ఏఏఐ)కి 13 శాతం వాటా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి 13 శాతం వాటా ఉంది. ఈ వాటా అమ్మకానికి ఇప్పటికే ఏఏఐ డైరెక్టర్ల బోర్డు ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇక కేంద్ర కేబినెట్‌ కూడా ఆమోద ముద్ర వేయడమే తరువాయి అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి విమానాశ్రయాన్నీ ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఇది చిన్నది కావడంతో భువనేశ్వర్ ఎయిర్‌పోర్టుతో కలిపి దీన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించనుంది. దీనికి ఏఏఐ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇక ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టులపై దృష్టి సారించనున్నట్టు సమాచారం. ఈ రెండు ఎయిర్‌పోర్టుల ఈక్విటీలో ఏఏఐకి 26 శాతం వాటా ఉంది. ముంబై, ఢిల్లీ ఎయిర్‌పోర్టుల్లో ఏఏకి 26 శాతం వాటా ఉంది. ఢిల్లీ, హైదరాబాద్‌ విమానాశ్రయాల్లో మెజారిటీ వాటా జీఎంఆర్‌ గ్రూప్‌నకు, ముంబై విమానాశ్రయంలో మెజారిటీ వాటా అదానీ గ్రూప్‌నకు, బెంగళూరు విమానాశ్రయంలో కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ మెజారిటీ వాటా కలిగి ఉంది. అయితే ఏఏఐ వాటాలను కూడా ఈ సంస్థలే కొనుగోలు చేస్తాయని భావిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story