కోవిడ్‌ బాధితుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం..!

కోవిడ్‌ బాధితుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం..!
కోవిడ్‌ బాధితుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రుణసదుపాయం కల్పిస్తోంది.

కోవిడ్‌ బాధితుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కష్టకాలంలో బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రుణసదుపాయం కల్పిస్తోంది. చికిత్స కోసం అన్ని జాతీయ బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులు 5 లక్షల వరకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తున్నట్లు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌ లో ప్రకటించారు.ఇప్పటికే బ్యాంకులో దేశ వ్యాప్తంగా లక్షలాది మందికి ఎలాంటి పూచీకత్తు లేకుండా చికిత్స కోసం రుణాలు ఇచ్చినట్లు మంత్రి ప్రకటించారు. కోవిడ్‌ రోగులకు సంబంధించి రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ సభ్యుడు కేఆర్‌ సురేష్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కొవిడ్‌ చికిత్స కోసం రూ.5 లక్షల మేరకు రుణం ఇవ్వాలని ఆయా బ్యాంకుల పాలకమండళ్లు ఒక విధానంగా నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. ఏపీలో 2,791 మంది, తెలంగాణలో 3,389 మంది ఈ రుణాలు పొందినట్టు మంత్రి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story