కరోనా విజృంభణ వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం..!

కరోనా విజృంభణ వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం..!
కరోనా విజృంభణ వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది.

కరోనా విజృంభణ వేళ కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. పీఎం గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద వీటిని పంపిణీ చేయనున్నారు. మే, జూన్‌ నెలలకు గాను ఒక్కొక్కరికి ఐదు కేజీల చొప్పున ఉచిత ఆహార ధాన్యాలను అందించనున్నారు. సుమారు 80 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది. ఇందు కోసం ప్రభుత్వం 26వేల కోట్లు వెచ్చించనుంది. ఇప్పటికే వలస కూలీలు స్వరాష్ట్రాలకు తరలిపోతున్నారు. కొందరు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.

Tags

Next Story