మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అంటూ వార్తలు.. కేంద్రం స్పందన ఇదే..

మరోసారి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అంటూ వార్తలు.. కేంద్రం స్పందన ఇదే..
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారని వార్తలు వస్తున్నాయి.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో మరోసారి లాక్‌డౌన్ విధిస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 25 నుంచి 46 రోజుల పాటు లాక్‌డౌన్ విధించేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందంటూ సోషల్ మీడియాలో వార్తలు హోరెత్తాయి. ప్లానింగ్ కమిషన్‌తో కలిసి నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ప్రభుత్వాన్ని కోరిందని.. అయితే, అత్యవసర వస్తువులను మాత్రం అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేసిందని వార్త హల్ చల్ చేసింది. ఈ వార్త నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ పేరుతో ఓ సర్క్యులర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ సోషల్ వైరల్ అవుతోంది. ఈ విషయం కేంద్రం దృష్టికి వెళ్లింది. దీందో కేంద్రం ఇప్పటికే ఖండించింది. తాజాగా ఫ్యాక్ట్ చెక్ చేసిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో దీనిని తప్పుడు వార్తగా నిర్ధారించి 'ఫేక్ న్యూస్' అలెర్ట్‌లో పోస్టు చేసింది.

Tags

Next Story