కేంద్రమంత్రి ఎస్.జైశంకర్‌కు మాతృ వియోగం

కేంద్రమంత్రి ఎస్.జైశంకర్‌కు మాతృ వియోగం
కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి సులోచన సుబ్రహ్మణ్యం శనివారం అర్థరాత్రి

కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి సులోచన సుబ్రహ్మణ్యం శనివారం అర్థరాత్రి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. తన తల్లి సులోచన సుబ్రహ్మణ్యం కన్ను మూశారన్ని.. ఇక అమ్మ లేదు అనే విషయం తనకు చాలా కష్టంగా అనిపిస్తుందని అన్నారు. ఆమె అనార్యోగ్యంతో ఉన్న సమయంలో చాలా మంది మానసిక స్థైర్యాన్ని కలిగించారని గుర్తు చేసుకున్నారు. వారందరకీ తమ కుటుంబ సభ్యుల తరుపున కృతజ్ఞతలు తెలిపారు. ఆయన తల్లి మరణం పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.

Tags

Next Story