దీనిపై వివరణ ఇవ్వండి.. ఫేస్‌బుక్ సీఈవోకు కేంద్రమంత్రి లేఖ

కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు లేఖ రాశారు. ప్రధాని మోదీపై ఫేస్‌బుక్ ఉద్యోగులు అనుచిత వ్యాఖ్యల గురించి లేఖలో ప్రస్థావించారు. సోషల్ మీడియా వేధికగా ఫేస్‌బుక్ ఉద్యోగులు ప్రధానినికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి కీలక పదవుల్లో ఉన్నవారు కూడా ప్రధానిని విమర్శిస్తున్నారని అన్నారు. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని మార్క్ జూకర్‌బర్గ్‌ను కోరారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఫేస్‌బుక్ ఖాతాలను అధికార పార్టీ తొలగించాలని ప్రయత్నాలు చేస్తుందనే వార్తలను ఆయన లేఖలో ప్రస్తావించారు. అయితే.. ఈ వార్తలు అన్ని అవాస్తవాలని కొట్టిపారేశారు. ఫేస్‌బుక్ ఇండియాకు తాము ఎలాంటి ప్రతిపాదనలూ చేయలేదని ఆయన తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
