కేంద్రం కీలక నిర్ణయం.. మౌలిక వసతుల అమ్మకం..!

6 లక్షల కోట్ల రూపాయల అసెట్ మానిటైజేషన్ ప్రణాళికను కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ ఆస్తుల్లో ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఆదాయార్జనే అసెట్ మానిటైజేషన్. 2025 కల్లా రైల్వేలు, ఫ్లైట్లు, రోడ్లు, విద్యుత్, టెలికాం, కోల్ సహా పలు రంగాల నుంచి.. 6 లక్షల కోట్ల నిధుల సమీకరణకు నిర్ణయించారు. ఈ ఏడాదే 88 వేల కోట్లు సమీకరించేలా ప్రాణాళిక రూపొందించారు. మానిటైజేషన్‌కి వెళ్లినా యాజమాన్యహక్కులు మాత్రం కేంద్రం వద్దే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.
నిధుల సమీకరణలో భాగంగానే కొత్త దారులు అన్వేషించిట్లు తెలిపారు. రైల్వే మానిటైజేషన్ ద్వారా 1.52 లక్షల కోట్లు 15 రైల్వే స్టేడియంలు, 160కిపైగా బొగ్గు, 761 మైనింగ్ బ్లాక్‌ల మానిటైజేషన్ చేయనున్నారు. టెలికం ప్రాజెక్టుల నుంచి 35 వేల 100 కోట్లు సమీకరించనున్నారు. నిరర్థకంగా ఉన్న ఆస్తులను ఆదాయార్జన మార్గాలుగా మారుస్తూ నిర్ణయించారు. ఉన్న ఆస్తుల్ని ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెంచుకోవడమే బ్రౌన్ ఫీల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా కేంద్రం పేర్కొంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com