ప్లాస్టిక్ జాతీయ జెండాను ఉపయోగిస్తే కఠిన చర్యలు!

జనవరి 26న దేశమంతా గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జాతీయ జెండా విషయంలో కేంద్రం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. కరోనా కాలంలో గణతంత్ర వేడుకల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచించింది.
దేశ పౌరులెవరూ ప్లాస్టిక్ త్రివర్ణ పతాకాన్ని వినియోగించవద్దని సూచించింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టూ నేషనల్ ఆనర్ యాక్ట్ 1971, ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా (2002) ప్రకారం ఇచ్చిన ఈ నిబంధనలను.. అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది కేంద్రం హోంశాఖ.
అలాగే వేడుకలు ముగిసిన తరువాత జెండాలను ఎక్కడ పడితే అక్కడ పారేయవద్దని హోం శాఖ ఆదేశించింది. ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా, 2002 లోని నిబంధనల ప్రకారం ప్రజలు కేవలం కాగితపు జెండాలను మాత్రమే ఉపయోగించుకునేలా చూడాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com