Chanda Kochhar Arrest: ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చార్ దంపతుల అరెస్ట్!

New Delhi
Chanda Kochhar Arrest: ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చార్ దంపతుల అరెస్ట్!
సీబీఐ అదుపులో ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చార్, ఆమె భర్త. లోన్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితులుగా గుర్తింపు.

Chanda Kochhar Arrest: ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందాకొచ్చార్ దంపతుల అరెస్ట్!


అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎంతటి వారికైనా శిక్ష తప్పదు అనడానికి చందా కొచ్చార్ వివాదమే నిదర్శనమని చెప్పాలి. ఐసీఐసీఐ లోన్ ఫ్రాడ్ కేసులో ఆ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్, ఛీఫ్ ఎక్సిక్యూటివ్ ఆఫీసర్ చందాకొచ్చార్, ఆమె భర్త దీపక్ కొచ్చార్ ను సీబీఐ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి ఇరువురిని అరెస్ట్ చేశారు.


ఐసీఐసీఐ బ్యాంక్ సర్వాధికారిణిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో వీడియోకాన్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా లోన్లు జారీ చేసినందుకుగానూ చందా కొచ్చార్ అభియోగాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. క్విడ్ ప్రో ఒప్పందంలో భాగంగా ఆమె భర్తకు చెందిన సంస్థ న్యూ పవర్ రెన్యుయేబుల్ కు వీడియోకాన్ సంస్థ నుంచి భారీ ఎత్తున పెట్టుబడి లభించింది. అనంతరం వీడియోకాన్ సంస్థను నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా గుర్తించడంతో బ్యాంక్ ఫ్రాడ్ బట్టబయలు అయింది.


2012లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓగా ఉన్న చందా కొచ్చార్ వీడియోకాన్ సంస్థకు రూ. 3,250కోట్ల లోన్ ను జారీ చేశారు. అయితే ఆరు నెలల వ్యవధిలోనే వేణుగోపాల్ ధూత్ కు చెందిన న్యూ పవర్ రెన్యుయేబుల్స్ సంస్థకు రూ. 64 కోట్లు లోన్ గా లభించాయి. ఈ సంస్థలో చందా కొచ్చార్ కు 50శాతం షేర్లు ఉండటం గమనార్హం.


ఐసీఐసీఐ ఛీఫ్ గా రాణిస్తున్న చందాకొచ్చార్ భారత్ లోనే అత్యంత ప్రతిభావంతమైన మహిళల్లో ఒకరిగా పేరుగాంచారు. ఆమె చీరకట్టు నుంచి పని తీరువరకూ ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఎన్నో పురస్కారాలను సైతం కైవసం చేసుకున్న చందాకొచ్చార్ కు 2011లో భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పద్మభూషణ్ తో ఆమెను సత్కరించింది.



Tags

Read MoreRead Less
Next Story