కర్నాటక శాసన మండలి సమావేశం రసాభాస

కర్నాటక శాసన మండలి సమావేశం రసాభాస

కర్నాటక శాసన మండలి సమావేశం రసాభాసగా మారింది. మండలి ఛైర్మన్‌ ప్రతాప్‌చంద్రపై బీజేపీ సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకోని ఛైర్మన్.. మండలిలోనే చర్చిద్దామంటూ దాటవేశారు. ఇవాళ్టి అజెండాలోనూ అవిశ్వాస తీర్మానాన్ని చేర్చలేదు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మండలిలోకి ఛైర్మన్‌ ప్రతాప్‌చంద్ర రాకుండా తలుపులు వేసేశారు. జేడీఎస్‌కు చెందిన డిప్యూటీ చైర్మన్ ధర్మగౌడను కౌన్సిల్ చైర్‌లో కూర్చోబెట్టారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ, జేడీఎస్ ప్రవర్తిస్తోందంటూ మండిపడ్డారు. కౌన్సిల్‌ చైర్‌లో కూర్చున్న డిప్యూటీ ఛైర్మన్ ధర్మ గౌడను కుర్చీ నుంచి లాక్కొచ్చారు కాంగ్రెస్ సభ్యులు. మరోవైపు బీజేపీ, జేడీఎస్‌ సభ్యులు డిప్యూటీ చైర్మన్‌కు మద్దతుగా నిలబడ్డారు. ధర్మ గౌడను చైర్‌లో కూర్చోబెట్టేందుకు బీజేపీ-జేడీఎస్ సభ్యులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఒకరినొకరు తోసుకున్నారు.



Tags

Next Story