Charanjit Channi Nephew : సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు అరెస్ట్ ..!

Charanjit Channi Nephew : అసెంబ్లీ ఎన్నికలకు ముందు, పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపీందర్ సింగ్ హనీ జలంధర్‌ని అక్రమ ఇసుక తవ్వకాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. భూపీందర్ సింగ్ హనీ జలంధర్‌ని నిన్న సాయంత్రం కస్టడీలోకి తీసుకున్న దర్యాప్తు సంస్థ నేడు సీబీఐ కోర్టులో హాజరుపరచనుంది. భూపీందర్ సింగ్ హనీ జలంధర్, అతని బిజినెస్ పార్ట్ నర్ల ఇళ్ళల్లో గతనెలలో ఈడీ అధికారులు దాడులు చేశారు. బంగారం, ఇతర వస్తువులతో పాటుగా రూ. 10 కోట్ల నగదుని స్వాధీనం చేసుకున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ అరెస్ట్‌లు తీవ్రం చర్చనీయాంశంగా మారాయి. 117 మంది సభ్యుల పంజాబ్ శాసనసభకు పోలింగ్ ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుండగా, మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com