Cheetah : దక్షిణాఫ్రికా చిరుతలు వచ్చేశాయి

Cheetah : దక్షిణాఫ్రికా చిరుతలు వచ్చేశాయి
చిరుతలను తీసుకువచ్చిన IAF C-17 Globe master విమానం శనివారం మధ్య ప్రదేశ్ గ్వాలియర్ లో ల్యాండ్ అయింది


మధ్య ప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్ కు దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను తీసుకువచ్చారు. నమీబియా నుంచి ఎనిమిది చుక్కల పిల్లి జాతుల మొదటి బ్యాచ్ ను విడుదల చేసిన ఐదు నెలల తర్వాత 12 చిరుతలను దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చారు. చిరుతలను తీసుకువచ్చిన IAF C-17 Globe master విమానం శనివారం మధ్య ప్రదేశ్ గ్వాలియర్ లో ల్యాండ్ అయింది.

కస్టమ్స్ అనుమతుల తర్వాత, వాటిని M-17 ఛాపర్లలో ఉదయం 11గంటలకు కూనో నేషనల్ పార్క్ కు రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిరుతలను మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ శాఖ భూపేంద్ర యాదవ్ చిరుతలను క్వారంటైన్ ఎన్ క్లోజర్ లోకి విడుదల చేస్తారు.

Tags

Read MoreRead Less
Next Story