Chennai: న్యాయమూర్తి విక్టోరియా గౌరీకి సుప్రీంకోర్టులో ఊరట

Chennai: న్యాయమూర్తి విక్టోరియా గౌరీకి సుప్రీంకోర్టులో ఊరట
విక్టోరియా గౌరీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు.

జడ్జి విక్టోరియా గౌరీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మద్రాస్‌ హైకోర్టు అడిషనల్ జడ్జిగా విక్టోరియా గౌరీ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. గౌరీ నియామకాన్ని నిలిపివేయడమంటే..కొలిజీయంను అవమానించడమేనని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. సుప్రీంలో వాదనలు కొనసాగుతుండగానే మద్రాస్‌ హైకోర్టు జడ్జిగా ప్రమాణం చేశారు గౌరీ.

అంతకుముందు గౌరీని పలు వివాదాలు చుట్టుముట్టాయి. మైనార్టీలను ఉద్దేశించి ఆమె గతంలో విద్వేష పూరిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్నాయి. గౌరీ సోషల్‌ మీడియా ఖాతాలు పరిశీలిస్తే ఆమె భారతీయ జనతా పార్టీ మహిళ విభాగానికి జనరల్ సెక్రటరీగా చేశారని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. ఐతే ప్రస్తుతం ఆమె రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్నారా లేదా అనేది స్పష్టంగా లేనప్పటికీ....మద్రాస్‌ హైకోర్టుకు ఆమెను జడ్జిగా రికమెండ్ చేస్తూ కొలిజియం తీసుకున్న నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

జడ్జిగా గౌరీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టుకు చెందిన 21 మంది లాయర్లు...రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సైతం లేఖ రాశారు. ఈ నిర్ణయం న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉందని లేఖలో వివరించారు. లేఖలో గతంలో గౌరీ మైనార్టీలను ఉద్దేశించి వ్యాఖ్యలను లేఖలో కోట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story