Chennai: కుల వివక్ష; థియేటర్ లో గిరిజనులకు ప్రవేశ నిరాకరణ

Chennai: కుల వివక్ష; థియేటర్ లో గిరిజనులకు ప్రవేశ నిరాకరణ
చెన్నై రోహిణీ థియేటర్లో కుల వివక్షను ఎదుర్కొన్న గిరిజన కుటుంబం; టికెట్లు కొన్నా సినిమా చూసేందుకు అనుమతించని సిబ్బంది....

మల్టీప్లెక్సులు, షాపింగ్ కాంప్లెక్స్ లు నగరవాసుల జీవితాల్లో ఓ భాగమైపోయాయి. కానీ, గిరిజనులకు ఇంకా అవి అందని ద్రాక్షలుగానే కనిపిస్తున్నాయి. అందరికీ స్వాగతం పలికే థియేటర్లలోకి అట్టడుగు వర్గానికి చెందిన గిరిజనులకు ప్రవేశం నిరాకరించిన ఘటన చెన్నైలోని రోహిణి థియేటర్ లో చోటుచేసుకుంది. స్థానికంగా ప్రసిద్ధిగాంచిన రోహిణీ థియేటర్ సిబ్బంది టికెట్లు బుక్ చేసుకున్న గిరిజనులను లోపలికి అనుమతించలేదు. కోలీవుడ్ సూపర్ స్టార్ శింబు పాటు తల సినిమా చూసేందుకు టిక్కెట్లు చూపించినప్పటికీ వారికి అనుమతి నిరాకరించారు. ఈ వ్యవహారం కాస్తా పెద్ద వివాదంగా మారడంతో యాజమాన్యం కల్పించుకుని వారిని తదుపరి షోకు అనుమతించింది. అయితే, మొదటిగా వారికి ప్రవేశ నిరాకరణ ఎందుకు చేయాల్సి వచ్చిందన్న అంశంపై థియేటర్ యాజమాన్యంపై విమర్శలు తలెత్తుతున్నాయి. పలువురు సెలబ్రిటీలు సైతం ఈ అంశంపై ట్వీట్ చేస్తున్నారు. ఈ అంశంపై రోహిణీ యాజమాన్యం వివరణ ఇచ్చినప్పటికీ ఈ వ్యవహారంపై తలెత్తిన వివాదం ఇప్పట్లో సద్దుమణగడం కష్టంగానే కనిపిస్తోంది.



Tags

Read MoreRead Less
Next Story