IT Company: ఐటీ కంపెనీ ఉద్యోగులకు.. ఆఫీస్ బాస్ అదిరిపోయే గిప్ట్..

IT Company: చెన్నైకి చెందిన ఒక IT సంస్థ సోమవారం తన ఉద్యోగులకు కంపెనీ విజయానికి తోడ్పడిన ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది. ఐడియాస్2ఐటీ అనే ఐటీ సంస్థ 100 మంది ఉద్యోగులకు మారుతీ సుజుకి కార్లను బహుమతిగా ఇచ్చింది.
పదేళ్లకుపైగా మాలో భాగమైన 100 మంది ఉద్యోగులకు 100 కార్లను బహుమతిగా ఇస్తున్నామని.. సంస్థ ప్రకటించింది. మనం ఉద్యోగుల ద్వారా పొందిన సంపదను తిరిగి ఉద్యోగులకు అందించాలన్నదే మా కాన్సెప్ట్ అని ఐడియాస్2ఐటి మార్కెటింగ్ హెడ్ సుబ్రమణియన్ చెప్పారు.
ఐడియాస్2ఐటీ వ్యవస్థాపకుడు, చైర్మన్ మురళీ వివేకానందన్ మాట్లాడుతూ.. ఉద్యోగులు తమ సంస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, కంపెనీ వారికి కార్లు ఇవ్వడం లేదని, తమ కష్టార్జితంతో వారే సంపాదించుకున్నారని అన్నారు.
సంస్థను స్థాపించినప్పుడు కొన్ని లక్ష్యాలను ఏర్పరుచుకుని వాటికి కట్టుబడి పని చేశాము. ఇప్పుడు కంపెనీలో 500మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ కార్లను ప్రధానం చేయడం మొదటి అడుగు మాత్రమే. సమీప భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని కార్యక్రమాలను రూపొందించాలని మేము ప్లాన్ చేస్తున్నాము," అని అన్నారు వివేకానందన్.
"సంస్థ నుండి బహుమతులు అందుకోవడం మాకు ఇది కొత్తకాదు. ప్రతి సందర్భంలో, కంపెనీ బంగారు నాణేలు, ఐఫోన్‌లు వంటి బహుమతులు ఇస్తుంటుంది.. అయితే కారు ఇవ్వడం అనే మాకు చాలా పెద్ద విషయం," అని బహుమతిని అందుకున్న ఉద్యోగి ప్రశాంత్ అన్నారు.
చెన్నైకి చెందిన మరో సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్ కంపెనీ (సాస్) కిస్‌ఫ్లో తన ఐదుగురు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ కార్లను బహుమతిగా అందించింది. ఆ కారు విలువ ఒక్కొక్కటి కోటి రూపాయలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com