12th Exams: 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు.. తేదీ ఖరారు

12th Exams: 12వ తరగతి పబ్లిక్ పరీక్షలు.. తేదీ ఖరారు
కోవిడ్ మహమ్మారి కారణంగా విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలంటే భయపడుతున్నారు విద్యాశాఖ అధికారులు. కానీ పరీక్షలు రాయందే ఫలితాలు ప్రకటించడం అసాధ్యం. దీని దృష్ట్యా..

12th Exams: ఛత్తీస్‌గర్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిజిబిఎస్‌ఇ) తన క్లాస్ 12 పరీక్షలను జూన్ 1 నుండి నిర్వహిస్తుంది. ఇందులో విద్యార్థులకు నిర్ధేశించిన కేంద్రాల నుండి ప్రశ్నపత్రాలను ఇంటికి తీసుకెళ్ళి, ఆన్సర్ షీట్లను ఐదు రోజుల్లో సమర్పించడానికి అనుమతిచ్చారు. .

సివిజిఎస్‌ఇ కార్యదర్శి వికె గోయల్ శనివారం సాయంత్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 2.86 లక్షల మంది విద్యార్థుల భద్రత దృష్ట్యా ఈ పద్ధతిలో పరీక్షలు నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.

12 వ తరగతి విద్యార్థులకు జూన్ 1 నుండి 5 వరకు ఐదు రోజులు ప్రశ్నపత్రాలు అందజేస్తారు. విద్యార్థులు అయిదు రోజులు వాటికి ఆన్సర్లు రాసి తిరిగి సంబంధిత కేంద్రాల్లో సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వులిచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story