collector Ranbir Sharma : కలెక్టర్ అత్యుత్సాహం.. పదవి నుంచి తొలిగిస్తూ సీఎం ఆదేశాలు..!

collector Ranbir Sharma : లాక్ డౌన్ టైమ్ లో బయటకువచ్చిన ఓ యువకుడిని కొట్టిన సూరజ్పుర్ కలెక్టర్ రణ్ వీర్ శర్మ పై వేటు పడింది. ఆయనను విధుల్లో నుంచి తొలగిస్తూ ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బఘేల్ ఆదేశాలు జారీ చేశారు. అటు రణ్ వీర్ శర్మ తీరును ఐఏఎస్ అసోసియేషన్ కూడా తప్పుబట్టింది. ఇలాంటి కష్ట సమయంలో ప్రజల పట్ల దయతో మెలగాలని అభిప్రాయపడింది. అటు బాధిత వ్యక్తి మాటమార్చి కారణాలు చెప్పడం వల్లే తనకి కోపం వచ్చిందని, అయితే తన ప్రవర్తనకి గాను క్షమాపణ కోరుతున్నట్లు రణ్ వీర్ శర్మ వెల్లడించారు. అంతకుముందు మందుల కోసం బయటకు వచ్చిన యువకుడిని కొట్టిన రణ్ వీర్ శర్మ.. అతడి ఫోన్ ను కూడా నేలకేసి కొట్టారు. అనంతరం పక్కనే ఉన్న పోలీసులనూ.. ఆ వ్యక్తిని కొట్టాలని ఆదేశించారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రణ్ వీర్ శర్మ పై వేటు పడింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com