Chhavi Mittal: చిన్నారి పెదవులపై ముద్దు.. ఘోరంగా ట్రోల్ చేసిన నెటిజన్స్..

Chhavi Mittal: చిన్నారి పెదవులపై ముద్దు.. ఘోరంగా ట్రోల్ చేసిన నెటిజన్స్..
Chhavi Mittal: పిల్లలపై తమ ప్రేమను వ్యక్తం చేయడానికి చాలా మార్గాలుంటాయి. కానీ కొన్ని అసహజమైన ప్రక్రియలు చూసేవారిని కొంత ఇబ్బందికి గురిచేస్తుంటాయి.

Chavi Mittal: పిల్లలపై తమ ప్రేమను వ్యక్తం చేయడానికి చాలా మార్గాలుంటాయి. కానీ కొన్ని అసహజమైన ప్రక్రియలు చూసేవారిని కొంత ఇబ్బందికి గురిచేస్తుంటాయి. ఇక ఇలాంటి నెట్టింట్లో పోస్ట్ చేస్తే ఇంకేముంది నెటిజన్లు ఓ రేంజ్‌లో వేసుకుంటారు.. ట్రోల్స్‌తో దాడికి దిగుతారు. తాజాగా టీవీ నటి ఛవీ మిట్టల్ తన కొడుకుని పెదవులపై ముద్దు పెట్టుకున్న ఫోటోను అభిమానుల కోసం షేర్ చేసింది. అంతే ఆమెని అస్సలు వదిలిపెట్టట్లేదు నెటిజన్లు. ఛవీకి ఇద్దరు పిల్లలు అరీజా, అర్హమ్.. తరచుగా వారి ఫోటోలను షేర్ చేస్తుంటుంది. నెటిజన్ల అభ్యతరాలను తిప్పి కొడుతూ ఛవీ పోస్ట్ పెట్టింది.. ఒక తల్లి తన పిల్లలను ఎలా ప్రేమిస్తుందో ఊహించలేము.. ఇది కొంతమందికి అభ్యంతరకరంగా ఉంటుందని నేను ఊహించలేదు. నాకు మద్దతుగా వచ్చిన వ్యాఖ్యలు నాకు మాత్రమే కాదు, అవి మానవత్వానికి మద్దతుగా ఉన్నాయి. ప్రేమను అర్థం చేసుకోలేని వ్యక్తులు ఇంకా ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. వారిని చూస్తుంటే నాకు జాలిగా ఉంది. వారి ఆలోచనలు ఎంత ఇరుకుగా ఉన్నాయో అర్థమవుతోంది అని పోస్ట్ పెట్టింది ఛవీ.

“నేను నా పిల్లలిద్దరినీ వారి పెదవులపై ముద్దుపెట్టుకున్న మరికొన్ని చిత్రాలను పంచుకున్నాను, ఎందుకంటే వారి పట్ల నా ప్రేమకు సరిహద్దులు ఎలా సెట్ చేయాలో నాకు తెలియదు. ప్రేమను చూపించడంలో నిస్సంకోచంగా ఉండాలని నేను వారికి బోధిస్తాను. దానికి వాళ్లు పాజిటివ్‌గా స్పందిస్తారు. నేను వారికి బోధించే ఏకైక విషయం ఏమిటంటే, వారు ఇష్టపడే వారిని బాధపెట్టకూడదని చెబుతాను. తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లలపై ప్రేమను ఎలా వ్యక్తం చేస్తారు నాకు చెప్పండి అని తనను వ్యతిరేకించిన వారిని ప్రశ్నిస్తోంది ఛవీ. అయితే కమెడియన్ భారతీ సింగ్ ఛవీ మిట్టల్ అభిప్రాయానికి మద్దతు తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story