Chicken 65: చికెన్ 65.. పేరు వింటే నోరూరుతోంది కదా.. ఇంతకీ ఆ పేరెలా వచ్చిందో తెలుసా!!

Chicken 65: చికెన్ 65.. పేరు వింటే నోరూరుతోంది కదా.. ఇంతకీ ఆ పేరెలా వచ్చిందో తెలుసా!!
X
Chicken 65: సాయింత్రం సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లినప్పుడు చికెన్ 65 టేస్ట్‌ని ఆస్వాదిస్తుంటారు స్నేహితులంతా..

Chicken 65: నాన్‌వెజ్ ప్రియులకు ఓ మంచి స్నాక్ ఐటెమ్.. సాయింత్రం సరదాగా ఫ్రెండ్స్‌తో కలిసి బయటకు వెళ్లినప్పుడు చికెన్ 65 టేస్ట్‌ని ఆస్వాదిస్తుంటారు స్నేహితులంతా.. కొంచెం స్పైసీగా, మరింత క్రిస్పీగా ఉండే ఈ టేస్టీ చికెన్ 65ని కనిపెట్టిన మహానుభావుడు ఎవరో కాని వారికి వందనం అనుకుంటారు ఫుడ్ ప్రియులు. అది సరే కానీ.. మరి చికెన్ 65కి ఆపేరెలా వచ్చిందని ఎప్పుడైనా ఆలోచించారా.. ఇది కూడా చైనా నుంచి వచ్చిందని అనుకుంటున్నారు కదా.. నూడిల్స్, మంచూరియాల్లాంటివన్నీ అక్కడి నుంచే వచ్చాయి కదా.. ఇది కూడా మేడిన్ చైనా అనుకుంటే పొరపాటు పడినట్లే.


వాస్తవానికి, చికెన్ 65 మన ఇండియన్ రెసిపీ. దీనిని చెన్నైకి చెందిన ప్రముఖ చెఫ్ AM బుహారీ 1965లో తన హోటల్‌లో పరిచయం చేశారు. భారతదేశం పాకిస్తాన్‌పై యుద్ధం చేస్తున్నప్పుడు ఇటువంటి వంటకం ఆలోచన వచ్చింది అతడికి. బుహారీ సైనికులకు తక్షణమే తయారు చేయగల రుచికరమైన మాంసాహార రుచులను అందించాలని అనుకున్నాడు. ఆ ప్రయోగ ఫలితమే ఈ చికెన్ 65.

అయితే, చికెన్ 65కి ఆ పేరు పెట్టడం వెనుక అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. కొంతమంది ఆహార నిపుణులు దీనిని సిద్ధం చేయడానికి 65 చిన్న చికెన్ ముక్కలను ఉపయోగించారు కాబట్టి అలా పిలుస్తున్నారని చెప్పారు. మరికొందరు ఆ రెసిపీ తయారీకి 65 రకాల మసాలా దినుసులు ఉపయోగిస్తారు.. అందుకే ఆ పేరు అన్నారు. ఇంకొందరేమో 65 రోజుల కోడిని ఈ వంటకం తయారీకి ఉపయోగిస్తున్నారు అని మరో కథనం కూడా ప్రచారంలో ఉంది. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది సైనికుల మెనూ జాబితాలో 65వ వంటకం అందుకే అలా పిలుస్తారు అని అనేవాళ్లూ ఉన్నారు.


అయితే బుహారీ హోటల్‌లో 1965లో తయారు చేసిన వంటకం.. అందుకే ఆ పేరు అనేదే ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేసిన కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రామ్‌లో కూడా ఈ ప్రశ్న వచ్చింది. చికెన్ 65 మూలాల గురించి అడిగారు.

ఇకపోతే చికెన్ 65ని ప్రపంచానికి పరిచయం చేసిన బుహారీ ఆ తరువాత 1978, 1982, 1990లలో చికెన్‌కు సంబంధించి వెరైటీ ఐటెమ్‌లు తయారు చేసి వాటికి సంబంధిత తేదీల ప్రకారం పేర్లు పెట్టారు.. కానీ వాటిలో ఏ ఒక్కటీ సక్సెస్ కాలేదు. చికెన్ 65 మాత్రమే ప్రజాదర పొందింది.

తన పేరు మీద ఉన్న వస్తువుపై పేటెంట్ పొందాలని బుహారీకి కొందరు సూచించారు. అయితే అతడు అందుకు నిరాకరించాడు. ఆహారం ఎవరి సొత్తు కాదు. దానిని వ్యాపారంగా మార్చకూడదు అని అనేవారు. అతని ఆలోచన, నిస్వార్థ వైఖరి కారణంగా చికెన్ 65 నాన్-వెజిటేరియన్ మెనూలో అగ్ర స్థానాన్ని సంపాదించింది.

Tags

Next Story