చిన్నారులకు ఎలాంటి మాస్కులు సురక్షితం..

కోవిడ్ నుండి రక్షించడానికి, సామాజిక దూరాన్ని నిర్వహించడం కష్టంగా ఉన్నప్పుడు ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) సిఫార్సు చేస్తుంది. అయితే ఈ సిఫార్సు పిల్లలకు వర్తిస్తుందా అంటే.. మూడు సంవత్సరాలు పైబడి ఉన్న పిల్లలు మాత్రమే అదీ ఎలాంటి అనారోగ్య సమస్యలు.. శ్వాస సంబంధిత సమస్యలు లేకపోతేనే మాస్క్ ధరించాలని పేర్కొంది.
చిన్నారులు ధరించే మాస్క్ కనీసం రెండు పొరలు కలిగి ఉండాలి. N95 రెస్పిరేటర్లు లేదా ప్లాస్టిక్ ఫేస్ షీల్డ్స్ అవసరం లేదు. ముఖ్యంగా, ఫేస్ మాస్క్‌ను తొలగించిన వెంటనే చేతులు శుభ్రంగా కడగాలి. పిల్లలు దుకాణాలకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించేలా చూడాలి. కుటుంబ సభ్యులతో కలిసి కారులో వెళ్లినప్పుడు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. మాస్క్ ధరించడం ఎంత అవసరమో దాని వలన తనకే కాకుండా ఇతరులనూ వైరస్ బారిన పడకుండా కాపాడుతుందని చిన్నారులకు వివరించి చెప్పాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com