China Apps Ban : ప్రజలను అప్పుల ఊబిలోకి దించుతున్నారు

చైనాకు చెందిన 232 యాప్‌లను కేంద్రం నిషేధించింది.138 బెట్టింగ్ యాప్‌లు, 94 లోన్ యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధించింది.ఈ యాప్స్..ప్రజలను అప్పుల ఊబిలోకి దించడంతో పాటూ గూఢచర్య సాధనాలుగా మారే ఆస్కారం కూడా ఉందని హోం శాఖ వర్గాలు తెలిపాయి.ఆరు నెలల క్రితమే 288 చైనా లోన్ యాప్‌లపై సమీక్ష చేసిన కేంద్రం వీటిలో 94 యాప్‌లు వివిధ ఈ-స్టోర్లలో అందుబాటులో ఉండగా మిగిలినవి థర్డ్ పార్టీ లింక్స్ ద్వారా అందుబాటులో ఉన్నాయని తేల్చింది.
ప్రజల ఆర్థిక ఇబ్బందులను అసరాగా తీసుకొని వారిని లోన్‌ల వైపు ఆకర్షించాక.. వడ్డీ రేట్లను ఈ యాప్‌లు అమాంతం పెంచేస్తున్నాయి.దీంతో లోన్‌లు చెల్లించలేకపోయిన వారిపై యాప్‌ల సిబ్బంది వేధింపులకు దిగుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఈ యాప్‌ల బారిన పడి ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో కేంద్రం చర్యలు తీసుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com