సెప్టెంబర్ 22.. మర్చిపోలేని రోజు: చిరంజీవి

సెప్టెంబర్ 22.. మర్చిపోలేని రోజు: చిరంజీవి
నటనకు కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ వచ్చినా అదే అభిమానం చూపించి హిట్ చేస్తున్నారు ప్రేక్షక దేవుళ్లు.

చిరంజీవి.. నేటి తరానికే కాదు మరి కొన్ని తరాలకు కూడా ఆయన ఓ ఇన్స్ఫిరేషన్.. ఆయన స్టెప్పులకు, ఆయన డ్యాన్స్ లకు ఫిదా అయి సినిమాల్లోకి వచ్చిన వాళ్లు ఎందరో.. చిరంజీవి సినిమా విడుదలైతే మొదటి రోజే వెళ్లి చూసేంత అభిమానం ప్రేక్షకులది. నటనకు కొంత గ్యాప్ ఇచ్చి మళ్లీ వచ్చినా అదే అభిమానం చూపించి ఆయన సినిమాలను హిట్ చేస్తున్నారు ప్రేక్షక దేవుళ్లు. సెప్టెంబర్ 22 గురించి చిరంజీవి ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. తన తొలి చిత్రం ప్రాణం ఖరీదు ఈ రోజే విడుదలైందని పేర్కొన్నారు. ఆగస్ట్ 22న నా పుట్టిన రోజైనా, నటుడిగా ప్రాణం పోసుకుంది ఈ చిత్రంతోనే అని చిరంజీవి తెలిపారు. నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికి ఈ సందర్భంగా మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని చిరంజీవి పేర్కొన్నారు.

Tags

Next Story