2 Sep 2020 11:56 AM GMT

Home
 / 
జాతీయం / తనువులు వేరైనా, మార్గం...

తనువులు వేరైనా, మార్గం వేరైనా గమ్యం ఒక్కటే: చిరంజీవి

తమ్ముడు పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమని, అభిమానాన్ని వినూత్నంగా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

తనువులు వేరైనా, మార్గం వేరైనా గమ్యం ఒక్కటే: చిరంజీవి
X

మెగాస్టార్ బిరుదుని చిరంజీవి సొంతం చేసుకుంటే.. పవర్ స్టార్ అని అభిమానులు ఇష్టంగా పిలుచుకునే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2 కావడంతో ఆయనకు ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అన్నయ్య చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కి ఓ చిన్న కవిత ద్వారా ప్రేమ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేశారు. దాంతో పాటు వారిద్దరూ ఆలింగనం చేసుకున్న ఫోటో కూడా పోస్ట్ చేశారు.

తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే

మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే

తన గుండె చప్పుడు ఎప్పుడూ జనమే

తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే

జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు

కళ్యాణ్ బాబు హ్యాపీ బర్త్ డే

అని చిరంజీవి.. తమ్ముడు పవన్ పై తనకున్న ప్రేమని, అభిమానాన్ని పంచుకున్నారు. చిరంజీవి చేసిన ట్వీట్ పవన్ అభిమానులను అలరిస్తోంది.


Next Story