Chopper Mishap: తృటిలో తప్పిన ప్రమాదం....

Chopper Mishap: తృటిలో తప్పిన ప్రమాదం....
X
శ్రీశ్రీ రవిశంకర్ కు తృటిలో తప్పిన ప్రాణాపాయం; హెలీకాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్....

ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకడు, మానవతావేత్త శ్రీశ్రీ రవిశంకర్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలీకాఫ్టర్ ను అత్యవసర ల్యాండింగ్ చేయడంతో ఆయనకు ఎలాంటి హానీ జరగలేదని అధికారులు వెల్లడించారు.


తమిళనాడులోని ఈరోడ్ జిల్లా నుంచి టేక్ ఆఫ్ అయిన హెలీకాఫ్టర్ ను వాతావరణం అనుకూలించకపోవడంతో హుటాహుటిన ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. తిరిగి వాతావరణం చక్కబడటంతో హెలీకాఫ్టర్ టేక్ ఆఫ్ అయినట్లు తెలుస్తోంది.


ఈ ఘటన ఉదయం 10.30గం.లకు చోటుచేసుకోగా, శ్రీశ్రీ రవిశంకర్ తిరుప్పుర్ జిల్లాలోని శ్రీ బృహన్నాయకీ అంబికా సమేత శ్రీ ఆంధ్ర కపిలేశ్వర స్వామి క్షేత్రంలో కుంభాభిషేకానికి పయనమైనట్లు తెలుస్తోంది.


Tags

Next Story