తండ్రి ఆనందం.. తన కంటే పై స్థాయిలో ఉన్న కూతురికి సెల్యుట్..

బిడ్డలు తమ కంటే ఉన్నతస్థాయిలో ఉండాలని ప్రతి తల్లీ తండ్రి కోరుకుంటారు. తమ కంటే పై స్థాయిలో ఉన్న వాళ్లని చూసి గర్వపడుతుంటారు.. అందరికీ చెప్పుకుంటారు. తాజాగా ఓ పోలీస్ ఆఫీసర్ కూడా అదే అనుభూతికి లోనయ్యారు.. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న ఉన్నతాధికారికి సబార్డినేట్ సెల్యూట్ చేయడం కన్నతండ్రితో పాటు చూసే వారికి ఆనందాన్నిచ్చింది.
కళ్ల ముందు పెరిగిన తన చిన్నారి తండ్రిని ఈ రోజు గర్వంగా తలెత్తుకునేలా చేసింది. అది కదా బిడ్డలు తండ్రికి ఇవ్వాల్సిన గౌరవం అని అందరూ అనుకునేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పోలీస్ శాఖ మొట్టమొదటి 'పోలీస్ డ్యూటీ మీట్ 2021' ను ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో నిర్వహిస్తున్నారు.
ఇందులో భాగంగానే తిరుపతిలో డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన కంటే పెద్ద స్థాయిలో ఉన్న కూతురికి తండ్రి సెల్యూట్ చేస్తున్న అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంది.
తండ్రీ, కూతురి అనుబంధాన్ని చూసిన తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి.. 'ఇలాంటి సన్నివేశాలు నిజానికి సినిమాల్లో చూస్తుంటాం. తండ్రీ కూతురు ఇలా యూనిఫాం ధరించి ప్రజాసేవ చేయడం నాకు వ్యక్తిగతంగా చాలా గర్వంగా ఉంది ఆల్ ది బెస్ట్ ప్రశాంతి' అని అభినందించారు. ఈ అరుదైన దృశ్యాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపింది.
#APPolice1stDutyMeet brings a family together!
— Andhra Pradesh Police (@APPOLICE100) January 3, 2021
Circle Inspector Shyam Sundar salutes his own daughter Jessi Prasanti who is a Deputy Superintendent of Police with pride and respect at #IGNITE which is being conducted at #Tirupati.
A rare & heartwarming sight indeed!#DutyMeet pic.twitter.com/5r7EUfnbzB
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com