సుప్రీంకోర్టులో అరుదైన దృశ్యం.. కాసేపు తెలుగులో విచారణ..!

సుప్రీంకోర్టులో అరుదైన దృశ్యం..  కాసేపు తెలుగులో విచారణ..!
సుప్రీంకోర్టులో ఇవాళ ఓ అరుదైన దృశ్యం కనిపించింది. వివాహానికి సంబంధించిన ఓ కేసు విచారణ కాసేపు తెలుగులో జరిగింది.

సుప్రీంకోర్టులో ఇవాళ ఓ అరుదైన దృశ్యం కనిపించింది. వివాహానికి సంబంధించిన ఓ కేసు విచారణ కాసేపు తెలుగులో జరిగింది. సుప్రీంకోర్టులో ఆంగ్ల భాషలో వాదనలు వినిపించేందుకు ఇబ్బంది పడుతున్న ఓ మహిళ కోసం అరుదైన నిర్ణయం తీసుకున్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్​.వి.రమణ. కాసేపు కేసు విచారణను తెలుగులోనే చేపట్టారు. ఉదయం సుప్రీంకోర్టులో వివాహానికి సంబంధించిన ఓ కేసు విచారణకు వచ్చింది. ఐతే.. కక్షిదారు అయిన ఓ మహిళ తన వాదనలు వినిపించాల్సి ఉంది. ఆంగ్లంలో మాట్లాడేందుకు ఆమె ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకున్న జస్టిస్ రమణ.. వాదనల్ని తెలుగులోని వినిపించాలని సూచించారు. ఆమె చెప్పిన విషయాన్ని ఆంగ్లంలోకి అనువదించి, తన సహచర న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్​కు వివరించారు జస్టిస్ రమణ. జస్టిస్ ఎన్​.వి.రమణకు మాతృభాషపై మమకారం ఎక్కువ. తెలుగువాడిగా పుట్టినందుకు గర్వించాలని అనేక సందర్భాల్లో ఆయన అన్నారు. ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే జరగాలని, న్యాయస్థానాల్లో తెలుగును ప్రోత్సహించాలని జస్టిస్‌ రమణ బలంగా కోరుకుంటారు.

Tags

Read MoreRead Less
Next Story