KCR Mumbai Tour : మహారాష్ట్ర సీఎం నివాసానికి చేరుకున్న సీఎం కేసీఆర్..!

KCR Mumbai Tour : కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి లక్ష్యంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే నివాసానికి చేరుకున్నారు సీఎం కేసీఆర్. ఉద్ధవ్ థాక్రేతో కలిసి లంచ్ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. తర్వాత సిల్వర్ ఓక్ ఎస్టేట్‌కు వెళ్లనున్న KCR...అక్కడ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో చర్చలు జరుపుతారు. కీలక చర్చల తర్వాత రాత్రి ముంబై నుంచి హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు.
అంతకుముందు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ముంబై చేరుకున్నారు కేసీఆర్. ముందుగా గ్రాండ్ హయత్ హోటల్‌కు వెళ్లారు. గ్రాండ్ హయత్ హోటల్‌లో సీఎం కేసీఆర్‌ను కలిశారు సినీ నటుడు ప్రకాశ్ రాజ్. తనతో వచ్చిన ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ కుమార్‌ను ప్రకాష్ రాజ్‌కు పరిచయం చేశారు కేసీఆర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com