Tamil Nadu Rains _ MK Stalin : 'మీకు నేనున్నా'.. బాధితులకు భరోసా కలిపిస్తోన్న సీఏం స్టాలిన్...!

Tamil Nadu Rains _ MK Stalin : తమిళనాడులో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. దీనితో పలు ప్రాంతాలు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ క్రమంలో ఎక్కడికక్కడే ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇలాంటి కష్టసమయంలో ప్రజలకి నేనున్నానని భరోసా కలిపిస్తున్నారు ఆ రాష్ట్ర సీఏం స్టాలిన్.. రెయిన్ కోట్ ధరించి పలు వరద ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు.
అక్కడ భాధితుల కష్టాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. భారీ వర్షం కారణంగా ఎంతమేర నష్టం కలిగిందనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనితో నెటిజన్లు ఆయన పైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
కాగా 2015లో వచ్చిన వరదల తర్వాత అక్కడ అత్యధిక వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. గడిచిన 24 గంటల్లో చెన్నైలో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిసిందని అధికారులు అంటున్నారు. కాగా వర్షాలు భారీగా కురుస్తున్న క్రమంలో పాఠశాలలకు రెండు రోజుల సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం.
ఇదిలా ఉండగా, తమిళనాడు, మహారాష్ట్ర, పుదుచ్చేరి, కేరళ, కర్ణాటక మరియు కోస్తాఆంధ్రాలలో నవంబర్ 11 వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఇండియన్ మెట్రాలాజికల్ డిపార్ట్‌మెంట్ అంచనా వేసింది.
Chennai: Tamil Nadu CM MK Stalin visits & inspects rain-affected areas of Perambur Barracks road, Otteri bridge, and Padi. pic.twitter.com/X1u8modUs8
— ANI (@ANI) November 7, 2021
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com