నా భర్త చేసిన అప్పులు నేను తీర్చేస్తా: కాఫీడే సీఈఓ మాళవిక

నా భర్త చేసిన అప్పులు నేను తీర్చేస్తా: కాఫీడే సీఈఓ మాళవిక
X
దేశంలో అతిపెద్ద కాఫీ రిటైల్ మార్కెట్ కేఫ్ కాఫీ డేను స్థాపించిన సిద్ధార్థ్, జూలై 31, 2019 న మంగళూరులో ఆత్మహత్య

కాఫీ డే గ్లోబల్ లిమిటెడ్ సంస్థ మాళవికా హెగ్డేను కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఓ) గా నియమించింది, 2019 జూలైలో తన భర్త విజి సిద్ధార్థ మరణం కారణంగా ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తోందని కంపెనీ సోమవారం తెలిపింది.

51 ఏళ్ల మాళవిక బిజెపి సీనియర్ నాయకుడు, మాజీ విదేశాంగ మంత్రి , కర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ కుమార్తె. ఆమె సీఈఓగా నియమించబడటానికి ముందు కంపెనీలో డైరెక్టర్‌గా ఉన్నారు.

దేశంలో అతిపెద్ద కాఫీ రిటైల్ మార్కెట్ కేఫ్ కాఫీ డేను స్థాపించిన సిద్ధార్థ్, జూలై 31, 2019 న మంగళూరు సమీపంలో ఆత్మహత్య చేసుకున్నారు. వ్యాపారంలో భారీ ఆర్థిక నష్టాల కారణంగా అతడు ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు సమాచారం.

జూలై 24 న కంపెనీలోని 25 వేల మంది ఉద్యోగులను ఉద్దేశించి రాసిన లేఖలో, కాఫీ డే భవిష్యత్తుకు తాను కట్టుబడి ఉన్నానని మాళవిక తెలిపారు. మరియు కంపెనీకి ఉన్న రుణ భారాన్ని తగ్గించేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పారు.

మాళవిక హెగ్డే గురించి తెలుసుకోవలసిన ఐదు విషయాలు ఇక్కడ ఉన్నాయి:

సీఈఓగా నియమించబడటానికి ముందు హెగ్డే సంస్థ యొక్క నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. సిద్ధార్థ మరణం తరువాత ఈ ఏడాది జూలైలో ఆమె బోర్డులో చేరారు. ఆమె 32 సంవత్సరాల క్రితం దివంగత పారిశ్రామికవేత్త సిద్ధార్థను వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన హెగ్డే ఇప్పుడు కనీసం ఐదేళ్లపాటు కాఫీడే సీఈఓగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆమె బెంగళూరు ప్రధాన కార్యాలయం నుండి పనిచేస్తారు.

Tags

Next Story