ప్రియురాలు కోసం బాబా వేషం... గడ్డం లాగడంతో బండారం బట్టబయలు!

తన ప్రేయసిని కలుకోవడం కోసం బాబాగా అవతారం ఎత్తాడు ఓ ప్రియుడు.. అయితే వేషం మొదట్లోనే బట్టబయలు కావడంతో స్థానికుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. ఈ ఈ ఉదంతం భువనేశ్వర్ లోని జాజ్‌పూర్ రోడ్ ఫెర్రో క్రోమ్ గేటు కాలనీలో శనివారం చోటుచేసుకుంది.
ఇక వివరాల్లోకి వెళ్తే...ఈ ఫేక్ బాబా అంగుల్‌లో ప్లస్ టూ చదువుతున్న ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయితే ఈ విషయం ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో తెలియడంతో వీరి ప్రేమకి అంగీకరించలేదు. దీనితో ప్రియురాలు ఇంట్లో విషయాలను తెలుసుకోవాలని అనుకున్నాడు.

తక్షణమే బాబాగా మారి ఆమెతో భేటీ కావాలనుకున్నాడు. అయితే బాబాగా ప్రియురాలు ఇంటి చుట్టే తిరుగుతుండడంతో అనుమానం వచ్చి స్థానికులు అతన్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. వారి ప్రశ్నలకి పొంతన లేని సమాధానాలు రావడంతో స్థానికులు సందేహంతో అతని గడ్డం లాగడంతో బండారం బట్టబయలైంది. దొంగబాబా అని తెలియడంతో స్థానికుల చేతిలో చావు దెబ్బలు తిన్నాడు. అనంతరం అతన్ని పోలీసులకి అప్పగించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com