Bihar: కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.23 లక్షల జీతాన్ని తిరిగి ఇచ్చేశారు.. ఎందుకో తెలుసా!!

Bihar: కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రూ.23 లక్షల జీతాన్ని తిరిగి ఇచ్చేశారు.. ఎందుకో తెలుసా!!
Bihar: విద్యార్థులు కాలేజీకి రాకపోవడానికి కారణాలు తెలియదు.. ఎన్ని సార్లు ఫోన్లు చేసినా ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు..

Bihar: విద్యార్థులు కాలేజీకి రాకపోవడానికి కారణాలు తెలియదు.. ఎన్ని సార్లు ఫోన్లు చేసినా ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు.. ఖాళీగా కూర్చోవడం.. నెలకాగానే జీతం తీసుకోవడం.. మనసు అంగీకరించట్లేదని మనసున్న ఆ మంచి మాష్టారు 33 నెలల జీతం రూ.23 లక్షలను కాలేజీ యాజమాన్యానికి తిరిగి ఇచ్చేశారు..

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ తన రెండు సంవత్సరాల తొమ్మిది నెలల ఉద్యోగానికి సంబంధించిన మొత్తం జీతం యూనివర్శిటీకి తిరిగి ఇచ్చేశారు. దీని వెనుక అతను చెప్పిన కారణం విని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల అధ్యాపకులు పిల్లలకు చదువు చెప్పడం లేదని, ప్రభుత్వం వీరిని కూర్చోబెట్టి మేపుతోందని తరచూ ఆరోపణలు వస్తుంటాయి. అలాంటి సమయంలో ముజఫర్‌పూర్‌లోని నితీశ్వర్ కాలేజీకి చెందిన ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆదర్శనీయమైన వ్యక్తిగా నిలిచారు.

హిందీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. లలన్ కుమార్ తరగతిలో విద్యార్థుల హాజరు శాతం సున్నాగా ఉంటోంది. ఈ కాలంలో తాను అందుకున్న మొత్తం జీతాన్ని తిరిగి ఇస్తూ మరో విభాగంలోకి బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు.

తాను రిజిస్ట్రార్‌కు లేఖ రాసిన కాపీలను వైస్ ఛాన్సలర్, ఛాన్సలర్, ముఖ్యమంత్రి యూజీసీ, పీఎంవో, రాష్ట్రపతికి కూడా పంపారు. రిజిస్ట్రార్ డాక్టర్ ఠాకూర్ తన చెక్కును స్వీకరించడానికి మొదట నిరాకరించారు. బదులుగా అతనిని తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించమని కోరాడు. అయితే అతను తనను బదిలీ చేయాలని పట్టుబట్టాడు. యూనివర్శిటీ విద్యావ్యవస్థపై లలన్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు.

డాక్టర్ లలన్ మాట్లాడుతూ, 'నితీశ్వర్ కళాశాలలో నా బోధనా పనికి నేను సంతృప్తిగా లేను. అందువల్ల, జాతిపిత మహాత్మా గాంధీ అందించిన జ్ఞానంతో మనస్సాక్షి మాటవిని నేను నియామక తేదీ నుండి తీసుకున్న జీతం మొత్తాన్ని విశ్వవిద్యాలయానికి అంకితం చేస్తున్నాను అని అన్నారు.

డాక్టర్ కుమార్ లేఖలో ఈ విధంగా రాశారు.. విద్యార్థులకు విధ్య నేర్పించకపోతే నేను ఎందుకు జీతం తీసుకోవాలి. నేను 25 సెప్టెంబర్ 2019 నుండి కళాశాలలో పని చేస్తున్నాను. బోధించాలనే కోరిక ఉంది కానీ అండర్ గ్రాడ్యుయేట్ హిందీ విభాగంలో 131 మంది విద్యార్థులకు ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఇక్కడి యూనివర్శిటీ విద్యార్ధులు చదువుకునే వాతావరణం లేదన్నారు. తనను మరో కళాశాలకు బదిలీ చేయాలని కోరుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story