Collegium : కేంద్రంపై సుప్రీం కోర్టు సీరియస్

Collegium : కేంద్రంపై సుప్రీం కోర్టు సీరియస్
హైకోర్టు జడ్జీల నియామకం, బదిలీ విషయంలో ఈ నెల 10వ తేదీలోపు కేంద్రం తన వైఖరి స్పష్టం చేయాలని గడువు విధించింది


జడ్జీల నియామకం విషయంలో కేంద్రం వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి మండిపడింది. చివరికి కొలీజియం సిఫారసు చేసిన జడ్జీల బదిలీలకు కూడా ఆమోదం తెలపరా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించింది. కొలీజయం నుంచి పలుసార్లు గుర్తు చేసినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని పేర్కొంది.న్యాయపరమైన, పరిపాలనపరమైన చర్యలు తీసుకునే పరిస్థితి కోర్టులకు కల్పించవద్దని పరోక్షంగా హెచ్చరించింది.

హైకోర్టు జడ్జీల నియామకం, బదిలీ విషయంలో ఈ నెల 10వ తేదీలోపు కేంద్రం తన వైఖరి స్పష్టం చేయాలని గడువు విధించింది. త్వరలోనే జడ్జీల నియామకంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని అటార్నీ జనరల్‌ కోర్టుకు తెలిపారు. ఎల్లుండిలోగా ప్రభుత్వం జడ్జీల నియామకంపై నిర్ణయం తీసుకుంటుందని ఏజీ స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story