IT Companies: ఆఫీస్‌కు వచ్చి పనిచేయండి: ఆర్డర్స్ పాస్ చేస్తున్న ఐటీ కంపెనీలు

IT Companies: ఆఫీస్‌కు వచ్చి పనిచేయండి: ఆర్డర్స్ పాస్ చేస్తున్న ఐటీ కంపెనీలు
IT Companies: కరోనా వచ్చి పోయింది. ఇంకా ఇంటి నుంచే పని చేస్తామంటే ఎలా.. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆఫీసులకు రండి అని అందరు ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేస్తున్నాయి ఐటీ కంపెనీలు.

IT Companies: కరోనా వచ్చి పోయింది. ఇంకా ఇంటి నుంచే పని చేస్తామంటే ఎలా.. అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆఫీసులకు రండి అని అందరు ఉద్యోగులకు అల్టిమేటం జారీ చేస్తున్నాయి ఐటీ కంపెనీలు. ఇప్పటికే టెక్ మహీంద్రా ఉద్యోగులు అందరూ ఆఫీసుకు వెళ్లి పని చేస్తున్నారు. టీసీఎస్, ఆర్సీజీ గ్రూప్, జెన్సర్ వంటి కంపెనీల్లో క్రమంగా వర్క్ ఫ్రమ్ హోంను ఎత్తేస్తున్నాయి. టాటా మోటార్స్ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. కానీ విప్రో సంస్థ మాత్రం తన ఉద్యోగులకు ఎక్కడి నుంచి అయినా పని చేసుకునే వెసులుబాటు కల్పించింది.

కరోనా దెబ్బకు భారీ కంపెనీలు కూడా ఆర్థిక నష్టాలను చవిచూశాయి. ఉద్యోగులకు ఆఖరి అవకాశంగా ఆఫీసులకు వస్తారా లేదా రాజీనామా చేస్తారా అని ఆర్పీజీ గ్రూప్ అధినేత హర్ష్ గోయెంకా ఇటీవల తన ఉద్యోగులకు తుది హెచ్చరిక జారీ చేశారు. ఉద్యోగులు వారంలో కొన్ని రోజులైనా ఆఫీసుకు రావలసిందే. వర్క్ ఫ్రమ్ హోం ను ఎక్కువ కాలం కొనసాగించడం సాధ్యం కాదు అని ఆయన పేర్కొన్నారు.

టీసీఎస్ కూడా ఉద్యోగులు ఆఫీస్‌కు రావాల్సిందే అని తేల్చి చెప్పింది. ప్రస్తుతం 20 శాతం మందే ఆఫీస్‌కు వస్తున్నారు. ఉద్యోగులు అందరూ ఆఫీసుకు రావడం అత్యవసరమని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపీనాథన్ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story