Bhagwant Mann : పంజాబ్ సీఎం పై కేసు నమోదు..మద్యం మత్తులో..!

Gurdwara : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్ కేసు నమోదు అయింది. బీజేపీ నేత తజీందర్ పాల్ సింగ్ బగ్గా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. సీఎం భగవంత్ మాన్ ఏప్రిల్ 14వ తేదీన మద్యం సేవించి గురుద్వారాలోకి ప్రవేశించారని తజీందర్ సింగ్ ఆరోపించారు.
తన ఫిర్యాదుపై చర్య తీసుకోవాలని పంజాబ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని అభ్యర్థించారు. దేశవ్యాప్తంగా జరుపుకునే బైసాఖీ సందర్భంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మద్యం సేవించిన స్థితిలో తఖ్త్ దమ్‌దామా సాహిబ్‌లోకి ప్రవేశించారని శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ (ఎస్‌జిపిసి) అంతకుముందు శుక్రవారం ఆరోపించింది.
దీనిపై పంజాబ్ ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలని కమిటీ డిమాండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించి మాన్‌పై కేసు నమోదు చేయాలంటూ బగ్గా నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Filed Police complaint against Punjab CM @BhagwantMann for Entering Gurudwara Damdama Sahib in Drunk Condition. I request @DGPPunjabPolice @PunjabPoliceInd to take action on my complaint pic.twitter.com/3bde4i32zI
— Tajinder Pal Singh Bagga (@TajinderBagga) April 16, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com