సక్సెస్ స్టోరీ: సాప్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలి బంజరు భూమిలో డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తూ.. అధిక లాభాలను ఆర్జిస్తూ..

సక్సెస్ స్టోరీ: కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ అధిక జీతం ఇచ్చే ఉద్యోగాన్ని వదులుకున్నాడు. బంజరు భూమిలో డ్రాగన్ ఫ్రూట్ పండించి విజయవంతమయ్యాడు. ప్రస్తుతం అతడు రైతులకు డ్రాగన్‌ఫ్రూట్ సాగులో శిక్షణ ఇచ్చేందుకు త్వరలో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
అల్లాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలహువా గ్రామానికి చెందిన అతుల్ మిశ్రా చెన్నైలో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశారు. తన తోటి గ్రామస్థులకు ఏదైనా చేసి జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలనే తపనతో చదువు పూర్తయ్యాక అథిక జీతం వస్తున్న ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. వ్యవసాయం చేయాలని అనుకున్నాడు.
ఇంటర్నెట్‌లో సర్ఫింగ్ చేసిన తర్వాత, అతను డ్రాగన్ ఫ్రూట్ సాగుతో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2018లో మహారాష్ట్రలోని షోలాపూర్ నుండి డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను తీసుకువచ్చి తమకు చెందిన బంజరు భూమిలో నాటాడు. అవి ఎదిగి ఏడాదిలోనే మంచి దిగుబడిని అందించింది. దీంతో అతడు తనకున్న ఐదెకరాల్లో పండ్ల సాగును విస్తరింపచేశాడు.
7 ఎకరాల బంజరు భూమిని లీజుకు తీసుకుని వచ్చే సీజన్‌లో మరిన్ని డ్రాగన్ ఫ్రూట్ పండిస్తానని చెబుతున్నాడు. డ్రాగన్ ఫ్రూట్ సాగులో తనకు సహాయం చేసేందుకు ముగ్గురు పురుషులు, ఒక మహిళను నియమించుకున్నట్లు మిశ్రా తెలిపారు.
అంతకుముందు, అతని కుటుంబం ఆ భూమిలో గోధుమలు పండించేవారు. ఇది పంటపై చేసిన ఖర్చు కంటే తక్కువ రాబడిని ఇస్తుంది. యువకుడు మాట్లాడుతూ, అతను తన పంటను సందర్శించేందుకు బీహార్, మధ్యప్రదేశ్, హర్యానాతో సహా అనేక రాష్ట్రాలకు చెందిన రైతులు వస్తారని తెలిపారు. వీరు మొక్కలను కొనుక్కొని వెళుతుంటారని తెలిపారు.
డ్రాగన్ ఫ్రూట్ నారు కొనేందుకు నా వద్దకు వచ్చే వారికి వాటిని ఎలా సాగు చేయాలో వివరిస్తాను అని ఆయన చెప్పారు. డ్రాగన్ ఫ్రూట్ మెక్సికో మరియు మధ్య అమెరికాకు చెందిన ఉష్ణమండల పండు. దీని రుచి కివీ మరియు పియర్ పండు మాదిరిగా ఉంటుంది. భారతదేశంలో ఇది మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలలో పెరుగుతుంది.
ఈ పంటను వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలో కూడా పండిస్తారు. నాటిన ఏడాది తర్వాత పండ్లు వస్తాయని తెలిపారు. మే నెల నుండి చెట్లకు పండ్లు రావడం ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతాయని తెలిపారు. వాటిని ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మండిలో మంచి లాభంతో విక్రయిస్తున్నట్లు మిశ్రా చెప్పారు.
మిశ్రా సాధించిన ఘనతను జిల్లా రైతులు కొనియాడుతున్నారు. రాంపూర్ దౌలత్‌పూర్ రైతు కుల్‌దీప్ సింగ్ మాట్లాడుతూ.. తాను కూడా డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఆయనతో పాటు మరికొందరు రైతులు మాట్లాడుతూ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ఎక్కువ నగదు అవసరమని, అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్యామ్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ.. రైతులు డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేసేందుకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఇక్కడి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ డ్రాగన్ ఫ్రూట్‌లో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ పండులో విటమిన్ సి, మెగ్నీషియంతోపాటు ప్రొటీన్, ఐరన్ ఉన్నాయని, ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని డాక్టర్ చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com