నలుగురితో లవ్.. లక్కీ డ్రాలో ఒక్కరితో పెళ్లి.. !

నలుగురితో లవ్.. లక్కీ డ్రాలో ఒక్కరితో పెళ్లి.. !
క్కడ ఓ నాలుగు రోజుల తర్వాత చివరికి లక్కీ డ్రాలో గెలిచిన విజేతకి ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేశారు. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చో

ఓ అమ్మాయి నలుగురిని ప్రేమించింది.. కానీ అందులో ఎవరిని పెళ్లి చేసుకోవాలో తెలియలేదు.. దీనితో ఇది పంచాయితీ వద్దకి వెళ్ళింది.. అక్కడ ఓ నాలుగు రోజుల తర్వాత చివరికి లక్కీ డ్రాలో గెలిచిన విజేతకి ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేశారు. ఈ విచిత్రమైన సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తాండా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో నివసించే ఓ అమ్మాయిని నలుగురు యువకులు ప్రేమించారు.

ఆ అమ్మాయి కూడా ఆ నలుగురు యువకులను కూడా ప్రేమించింది. అయితే ఓ రోజు... ఆ నలుగురూ కలసి అమ్మాయిని ఎత్తుకెళ్లి వేరే ఊరిలో దాచి పెట్టారు. ఇది కాస్తా అక్కడ.. ఇక్కడ తెలియడంతో.. ఆ అమ్మాయిని, ఆ నలుగురిని బలవంతంగా ఊరికి తీసుకొచ్చారు. అక్కడ పంచాయితీ పెట్టారు. ముందుగా ఆ అమ్మాయి తండ్రి పోలీసులకి ఫిర్యాదు చేయాలనీ అనుకున్నాడు. కానీ గ్రామస్తులు అతన్నీ వారించారు. ఎత్తుకెళ్లిన ఆ నలుగురు యువకులలో ఎవరో ఒకరితో ఆ అమ్మాయి వివాహం చేసేద్దామని తండ్రిని సముదాయించారు.

ముందుగా ఆ గ్రామ పెద్దలు.. ఆ అమ్మాయిని పిలిపించి.. నీకు ఈ నలుగురిలో నీకు ఎవరంటే బాగా ఇష్టమని అడిగారు. ఆ అమ్మాయి.. తడుముకోకుండా నలుగురూ ఇష్టమే అని చెప్పింది... ఆ తర్వాత ఆ నలుగురిని పిలిపించి మీ నలుగురు కలసి మీలో ఒకరిని నిర్ణయిస్తే అతనికిచ్చి ఆ అమ్మాయితో పెళ్లి చేస్తామని చెప్పారు. అయితే దీనికి ఆ నలుగురు ఒప్పుకోలేదు.

దీనితో ఏం చేయాలో తెలియక మూడు రోజులు తలలు పట్టుకున్నారు ఆ గ్రామ పెద్దలు... చివరికి ఓ ఉపాయాన్ని అలోచించి లక్కీ డ్రానే దీనికి పరిష్కారమని అనుకున్నారు. అనంతరం నాలుగు స్లిప్పులై నలుగురు అబ్బాయిల పేర్లు రాసి.. లక్కీ డ్రా వేశారు. డ్రాలో విజేతగా నిలిచిన అబ్బాయికి అమ్మాయినిచ్చి వివాహం చేసేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags

Next Story