Congress: కేంద్రంపై ధ్వజమెత్తిన సూర్జేవాల

ఆదానీ గ్రూప్ షేర్ల పతనంతో ఎల్‌ఐసి, ఎస్‌బిఐ 78వేల కోట్లు నష్టపోయినా కేంద్రం, దర్యాప్తు సంస్థలు ఎందుకు మౌనంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. అదానీ గ్రూప్ షేర్లు అక్రమాలకు పాల్పడుతుందని రిసెర్చ్ నివేదిక ఆరోపించిన అనంతరం ఎల్‌ఐసి, ఎస్‌బిఐ అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టాయని ఆరోపించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సూర్జేవాలా. ఎల్‌ఐసిలో ఉన్నది ప్రజల సంపదన్నారు. ఇంత జరిగినా మళ్లీ ఎల్‌ఐసి అదానీ గ్రూప్‌లో ఎందుకు 300కోట్లు పెట్టుబడి పెడుతోందని ప్రశ్నించారు.
అదానీ గ్రూప్‌కు ఎస్‌బీఐతో పాటు ఇతర బ్యాంకులు 81 వేల 200కోట్లు రుణాలు ఇచ్చాయని సుర్జేవాలా తెలిపారు. జనవరి 24, 27న ఎస్‌బిఐ, ఎల్‌ఐసిలు 78 వేల 118కోట్లు నష్టపోయాయని ఆయన ఆరోపించారు . ఎస్‌బిఐ అదానీ గ్రూప్‌లో పెట్టిన పెట్టుబడి నష్టపోవడం దీనికి అదనంగా పేర్కొన్నారు. ఆర్బీఐ, ఈడీ, కారొరేట్ మినిస్ట్రీ అఫైర్స్ నేతృత్వంలోని ఫ్రాడ్ ఇన్విస్టిగేషన్ ఆఫీస్, కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఎందుకు స్పందించడం లేదని వరుస ట్వీట్‌లలో ధ్వజమెత్తారు. ఆర్థిక మంత్రిని పదవి నుంచి తొలగించి దర్యాప్తుకు ఆదేశించాలని సుర్జేవాలా డిమాండ్ చేసారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com