Cooking Oil Price: మిడిల్ క్లాస్‌కు మరో గుడ్ న్యూస్.. ఈసారి నూనె ధరలు..

Cooking Oil Price (tv5news.in)
X

Cooking Oil Price (tv5news.in)

Cooking Oil Price: మొన్న చమురు ధరలను తగ్గించిన కేంద్రం.. ఇవాళ వంట నూనె ధరలను కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

Cooking Oil Price: మొన్న చమురు ధరలను తగ్గించిన కేంద్రం.. ఇవాళ వంట నూనె ధరలను కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. క్రూడాయిల్, పామాయిల్ పై విధిస్తున్న అగ్రిసెస్ ను 20శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది కేంద్రం. అలాగే సన్ ఫ్లవర్ ఆయిల్స్ పై వేస్తున్న పన్నును 5శాతానికి తగ్గించింది. కేంద్రం నిర్ణయంతో సామాన్యులపై భారం తగ్గనుంది.

రెండేళ్లుగా వంటనూనె ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో పేదలపై భారం తగ్గనుంది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో కేంద్రంపై విమర్శలు వస్తున్నాయి. వీటికి చెక్ పెడుతూ ధరల స్థీరికరించే దిశగా అడుగులు వేస్తోంది కేంద్రం.

Tags

Next Story