సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న వంట నూనెల ధరలు!

మార్కెట్ లో ధరలు మండిపోతున్నాయి. ఏ నిత్యవసర వస్తువుల ధరలు చూసినా ఆకాశాన్ని తాకుతున్నాయి. పప్పుల ధరలు సెంచరీ క్రాస్ చేసి నిప్పులు కక్కుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం లో కేజీ వంద రూపాయల లోపు ఉన్న కందిపప్పు ఇప్పుడు 130 కి చేరి కొనండి చుద్దాం అంటూ సవాల్ విసురుతుంది. కంది పప్పు ధర హోల్ సెల్ మార్కెట్ లో 110 ,చిల్లర కిరాణా షాపు లో 130 వరకు పలుకుతుంది.
గతంలో ధరలు పెరిగినప్పుడు సర్కారు రేషన్ షాపుల్లో సబ్సిడి లో కేజీ 50 రూపాయలకు అందించింది. కాని ఇప్పుడు కంది పప్పు ధర 150 కి చేరువ అవుతున్నా రేషన్ షాపులో కంది పప్పు ఇవ్వడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక నేనేమి తక్కువ అంటు మినపప్పు ధర కూడా డబుల్ సెంచరీకి చెరువలో ఉంది. కిలో 130 రూపాయలు పలుకుతోంది.
మరో వైపు మిగతా పప్పుల ధరలది అదే దారి. పెసర పప్పు ధర సెంచరీ దాటింది. కిలో110 రూపాయలు పలుకుతుంది. ఇక శనగ పప్పు కిలో 80 రూపాయలకు చేరింది. పప్పు ధరలు ఇలా నిప్పులు కక్కుతుండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు టిఫిన్స్ కు ఎప్పుడో టాటా చెప్పేశారు. మరో వైపు వంట నూనెల ధరలు కూడా ఉడికిపోతున్నాయి. వంద పెట్టినా లీటరు నూనె వచ్చే పరిస్దితి లేదు. పల్లీ నూనె, సన్ ప్లవర్ నూనె ధరలు 150 రూపాయలకు చేరువయ్యాయి.
వంట నూనేల ధరలు చుక్కలను తాకుతున్నాయి. పల్లి నూనె , సన్ ఫ్లవర్ ఆయిల్ , పామాయిల్ ఇలా అన్నిxంటి ధరలు కేజీ కి 30 నుంచి 40 రూపాయల వరకు పెరిగాయి. దీనితో సామాన్య జనం లబోదిబోమంటున్నారు. పల్లి నూనె లీటర్ ప్యాకెట్ 150 , సన్ ఫ్లవర్ లీటర్ ప్యాకెట్ 130 , ఆఖరికి పామాయిల్ లీటర్ 110 అయ్యింది. ఓ వైపు అకాల వర్షలకు పంట దెబ్బతినడం, ఉత్పత్తి సరిగా లేక పోవడం మరో వైపు పెట్రోల్ , డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ట్రాన్స్పోర్ట్ చార్జీలు పెరిగి పప్పులు, నూనెల ధరల పెరుగుదలకు కారణం.
మూలిగే నక్క పై తాటి పండు పడ్డట్లు , ఇప్పటికే పప్పులు , నూనెల ధరలు పెరిగి ఇబ్బంది పడుతుంటే అటు వంట గ్యాస్ రెండు వారాల వ్యవధి లోనే వంద పెరిగింది. దీంతో ఏమి కొనేట్టు లేదు. ఏమి తినేటట్టు లేదూ సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com