దేశంలో కరోనా.. ఆగస్టులోనే అత్యధికంగా

దేశంలో కరోనా.. ఆగస్టులోనే అత్యధికంగా
భారత్ లో కరోనా కేసులు ప్రతి నెలా రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్క ఆగస్టు నెలలోనే దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల

భారత్ లో కరోనా కేసులు ప్రతి నెలా రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. ఒక్క ఆగస్టు నెలలోనే దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల కేసులు నమోదయ్యాయి. ఒక్క నెలలో ఇన్ని కేసులు ఏ దేశంలోనూ నమోదు కాలేదు. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న అమెరికాలోనూ 19 లక్షల 4 వేల కేసులు నమోదయ్యాయి. ఒక్క భారత్ లోనే రికార్డు స్థాయిలో ఆగస్ట్ నెలలో కేసులు నమోదయ్యాయి. అయితే మరణాలు అధికంగా అమెరికా, బ్రెజిల్ దేశాల్లో సంభవిస్తున్నాయి. అమెరికాలో ఆగస్టు నెలలో నమోదైన కరోనా మరణాలు 31వేలు కాగా, బ్రెజిల్ లో దాదాపు 30 వేల మరణాలు చోటు చేసుకున్నాయి. భారత్ లో ఈ సంఖ్య 28వేలు ఉంది. దేశంలో నిత్యం కోవిడ్ కేసులు 70వేల వరకు నమోదవుతున్నాయి. మంగళవారం నాటికి దేశంలో నమోదైన కరోనా కేసులు 36 లక్షల 91 వేలకు చేరుకుంది. వీరిలో ఇప్పటికే 28 లక్షల 39 వేల మంది కోలుకోగా 7 లక్షల 85 వేల మంది చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం భారత్ లో కరోనా రికవరీ రేటు 76 శాతం దాటింది. గడిచిన ఆరు రోజుల్లో మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.

Tags

Read MoreRead Less
Next Story