భారత్‌లో ఒక్క రోజులోనే భారీగా కేసులు నమోదు

భారత్‌లో ఒక్క రోజులోనే భారీగా కేసులు నమోదు

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి పీక్స్‌కు చేరుకుంటోంది. ఒక్క రోజులో రికార్డుస్థాయిలో 95 వేల 735 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఇంత భారీగా కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 44 లక్షల 65 వేల 863కి చేరింది. దేశంలో ప్రస్తుతం 9 లక్షల 19 వేల 18 యాక్టివ్ కేసులు ఉండగా.. 34 లక్షల 71 వేల 784 మంది రికవర్ అయ్యారు. బుధవారం ఒక్క రోజులో కరోనా నుంచి కోలుకుని 72 వేల 939 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 77.74 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో మరో 11 వందల 72 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం ఇప్పటి వరకు కరోనా మరణాలు 75 వేల 62కి చేరాయి. దేశంలో ప్రస్తుతం కరోనా మరణాల రేటు 1.6 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 23 వేల 577 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 9 లక్షల 67 వేలు దాటింది. వీరిలో రెండున్నర లక్షల యాక్టివ్ కేసులు ఉండగా... 6 లక్షల 86 వేల మంది రికవర్‌ అయ్యారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 387 మంది చనిపోయారు. అక్కడ మొత్తం కరోనా మరణాల సంఖ్య 27 వేల 787కి చేరింది. కేసుల పరంగా రెండోస్థానంలో ఉన్న ఏపీలో కొత్త మరో 10 వేల 418 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మొత్తం కేసుల సంఖ్య 5 లక్షల 27 వేలు దాటింది. ఏపీలో 97 వేల యాక్టివ్ కేసులు ఉండగా... 4 లక్షల 25 వేల మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఒక్క రోజులో మరో 78 మంది చనిపోగా.. మొత్తం మరణాలు 8 వేల 90కి చేరాయి. అటు తమిళనాడు, కర్నాటకలోనూ ప్రతీరోజు భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్నటి వరకు 5 కోట్ల 29 లక్షల మంది కరోనా టెస్టులు నిర్వహించినట్టు ICMR తెలిపింది.

Tags

Next Story