మౌత్‌వాష్‌తో కరోనా.. !!

మౌత్‌వాష్‌తో కరోనా.. !!
వ్యాక్సిన్ వచ్చేలోపు రోగుల ప్రాణాలు కాపాడే ప్రయత్నాలు కోకొల్లలుగా చేస్తున్నారు వైద్యులు.

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ వచ్చేలోపు రోగుల ప్రాణాలు కాపాడే ప్రయత్నాలు కోకొల్లలుగా చేస్తున్నారు వైద్యులు. అయితే నోటిలోని సూక్ష్మ క్రిములు అనారోగ్య హేతువులు. ఈ క్రిములను నిర్మూలించేందుకు వాడే మౌత్‌వాష్‌తో కరోనా అంతమవుతుందని బ్రిటన్‌లోని యూనివర్శిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్ పరిశోధకులు చెబుతున్నారు. సెటిపైరిడినియం క్లోరైడ్‌ (సీపీసీ)తో తయారు చేసిన మౌత్‌వాష్‌లు నోటిలోని కొవిడ్‌-19ను కేవలం 30 సెకండ్లలోనే పూర్తిగా చంపివేయగలవని ఈ పరిశోధనలో పాలు పంచుకున్న నిక్‌ క్లేడన్‌ తెలిపారు. మౌత్‌వాష్‌లో సీపీసీ 0.07 శాతం ఉన్నా కరోనాను అంతం చేయగలదన్నారు. అయితే, ఈ మౌత్‌వాష్‌లు కరోనా చికిత్సకు ఉపయోగపడుతాయని చెప్పలేమని, కడుపులోకి చేరిన కరోనాను చంపలేకపోవచ్చని అన్నారు.

Tags

Next Story