పోలీస్ ఇంట విషాదం నింపిన కరోనా.. అయిదు రోజుల వ్యవధిలో ముగ్గురు

కరోనా మహమ్మారిని మర్చిపోయి సాధారణ జీవితం గడుపుదామనుకున్నవారికి మళ్లీ షాకిస్తోంది.. కేసులు పునారావృతం కావడంతో పాటు మరణాలు సంభవించడం ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండవలసిన అవసరాన్ని తెలియజెబుతోంది. ఓ విషాద ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. కానిస్టేబుల్‌గా పనిచేసే ధావల్ రావల్ ఇంట్లో తల్లిదండ్రులతో పాటు సోదరుడికి కరోనా సోకింది. దీంతో వారి ముగ్గురినీ అహ్మదాబాద్ తక్కరానగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు.
పరిస్థితి విషమించడంతో.. ధావల్ తల్లిదండ్రులను మరో ఆస్పత్రికి మార్చారు. చికిత్స పొందుతూ నవంబర్ 14న ధావల్ తల్లి మరణించారు. రెండు రోజుల వ్యవధిలో తండ్రి కూడా మృత్యువాత చెందారు. ఆ షాక్‌లో ఉండగానే ఆ తెల్లారి సోదరుడు కూడా కన్నుమూశారు. ఇలా అయిదు రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు మరణించడం కుటుంబసభ్యులతో పాటు స్థానికులను కలచి వేసింది. కరోనా మహమ్మారి మన జీవితాల్లో నుంచి ఎప్పుడు వెళుతుందో, ఇంకా ఎంత మందిని పొట్టన పెట్టుకుంటుందో అని ఈ విషయం తెలిసిన వారు ఆందోళన చెందుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com