కరోనాకు చెక్ పెట్టే కొత్త హెల్త్ సప్లిమెంట్..

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న..కరోనాకు చెక్ పెట్టేందుకు కొత్త హెల్త్ సప్లిమెంట్ అందుబాటులోకి రానుంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టడానికి సంప్రదాయ వైద్యంతోనే ఆధునిక చికిత్స నినాదంతో చేపట్టిన పరిశోధనలు సత్ఫలితాలిస్తున్నాయి. క్లోన్ డీల్స్ ప్రైవేట్ లిమిటెడ్... CCMBలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో.. కరోనెయిడ్ అనే హెల్త్ సప్లిమెంట్‌ను గురువారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. యాంటీ వైరల్, ఇమ్యూనిటీ బూస్టర్‌గా రూపొందిని ఈ హెల్త్ సప్లిమెంట్‌ను... సీసీఎమ్‌బీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా విడుదల చేస్తారు. ఇమ్యూనిటీ బూస్టర్‌గా... ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించబోతోందనే మాట వినిపిస్తోంది.
కరోనా మహమ్మారి చేస్తున్న విలయతాండవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్‌ను అరికట్టే మందు కోసం యావత్ ప్రపంచం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. తొలిసారిగా.. ఓ యాంటీ వైరస్ ఔషధ ఆహారంపై ప్రయోగం సఫలమైంది. కరోనా వైరస్‌ను మట్టుబెట్టే క్రమంలో.. కొత్త సప్లిమెంట్ కరోనెయిడ్ అందుబాటులోకి వస్తోంది. ఔషధ పుట్టగొడుగుల నుంచి తయారు చేసిన ఈ ఫుడ్ సప్లిమెంట్‌కు హైదరాబాద్‌లోని CCMB వేదికైంది. ఈ ఫుడ్ సప్లిమెంట్‌పై అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌తో కలిసి.. క్లోన్ డీల్స్ సంస్థ సంయుక్త పరిశోధనలు చేసింది.
కార్డిసెప్స్, కర్కమిన్ కాంబినేషన్‌లో కోవిడ్-19కి ఓరల్ సప్లిమెంట్ కరోనెయిడ్ తయారీ జరిగింది. ఔషధగుణాలున్న పుట్టగొడుగులతో కరోనెయిడ్‌ను తయారు చేశారు. పసుపు మిశ్రమంతో కలిసి కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో కీలకపాత్ర పోషించనుంది. ఊపరితిత్తుల పనితీరు మెరుగుపరచడం, యాంటీ ఆక్సిడెంట్‌గా రోగనిరోధక శక్తి పెంచేందుకు ఈ ఫుడ్ సప్లిమెంట్ దోహదపడుతుంది. సహజసిద్ధమైన ప్రకృతి ఉత్పత్తి ద్వారా రోగనిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటీ బూస్టర్‌ను క్లోన్ డీల్స్ రూపొందించింది. ఓరల్ సస్పెన్షన్ రూపంలో తీసుకున్న కరోనెయిడ్ ఇమ్యూనిటీ బూస్టర్... కరోనాపై పోరాడటంలో విజయవంతమైన ఫలితాలను ఇచ్చినట్టు పరిశోధనల్లో తేలింది.
యాంటీవైరల్ కరోనా చికిత్సలో కార్డిసెప్స్ కీలకమైతే, ముందే రోగనిరోధక శక్తి పెంచే యాంటీవైరల్, ఇమ్యూనిటీ బూస్టర్ మెరుగైన ఫలితాలు ఇస్తాయని క్లోన్ డీల్స్ పరిశోధకులు భావిస్తున్నారు. దీపావళి వరకు దేశవ్యాప్తంగా అందరికీ ఇమ్యూనిటీ బూస్టర్‌ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పిల్లలు, పెద్దలు, ముసలివారు... అందరూ కరోనెయిడ్ హెల్త్ సప్లిమెంట్‌ను తీసుకోవచ్చంటున్నా క్లోన్‌డీల్స్ నిపుణులు. ధరలు.. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు క్లోన్‌డీల్స్ ప్రతినిధులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com